భూమిక హెల్ప్ లైన్‍కు రకరకాల కేసులు వస్తాయి. అందులో ముఖ్యంగా కొన్ని :
కుటుంబ హింసకు సంబంధించినవి,వివాహేతర సంబంధాలు, విడాకులు, భర్త / అత్త మామల వేధింపులు, రెండో పెళ్ళి, భర్త చేతిలో లైంగిక వేధింపులు, మద్యపాన వ్యసనం, ప్రేమ సంబంధాలు, పిల్లలపై జరుగుతున్న హింసలు, ఆరోగ్యం, విద్య / మార్గదర్శకత్వం, మనోవర్తి , ట్రిఫికింగ్ కేసులు, బాల కార్మికులు మొదలైనవి.
భూమిక హెల్ప్ లైన్‍కు ఎంతో మంది, ఎన్నో రకాలైన సమస్యలతో ఫోన్స్ చేస్తారు. వాటి తీవ్రతను గమనించిన హెల్ప్ లైన్ వారికి సలహా, సమాచారాలు అందించి సమస్య నుండి ముందుకు నడిచే వర్గాన్ని చూపించింది. ఆ సమస్యలలో కొన్ని ఉదా :-
సేవార్ధి పేరు మాధవి (పేరు మార్చాం) ఆమె హైదాబ్రాద్ నివాసి, ఆమె భర్త రైల్వే డిపార్ట్ మెంట్‍లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమెకు పెళ్ళి జరిగి 30 సంలు, ఆమెకు ముగ్గురు పిల్లలు. మాధవి సమస్య ఏమిటంటే : ఆమె భర్తకు సెక్సువల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువ, కాని అతనికి ఆ సామర్ధ్యం లేదు. కనుక బయట దొరికిన కొన్ని పరికరాలను కొని తీసుకువచ్చి వాటిని ఉపయెగించి తృప్తి చెందుతాడు. కాని ఈ బాధను భరించేది మాత్రం మాధవి. అతను తెచ్చిన పరికరాలను ప్రతీ సారి ఆమె విరగకొట్టడం, అతను తిరిగి కొత్తవి కొనటం. ఇది గత కొన్ని సంలుగా జరుగుతూనే వుంది. ఈ విధంగా తన భర్త ఆమెపై రాక్షసంగా, కూర్రంగా పవ్రర్తించడం వలన మాధవి మానసికంగా, శారీరకంగా చాలా బలహీనమైంది. దీనికితోడు ఆమె భర్త త్వరలో రిటైర్ అవ్వబోతున్నాడు. ఆ రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులు కావాలంటే ఆమె తన భర్త చెప్పిన విధంగా చేయలని చేయకపోతే డబ్బులు. ఇవ్వడని భయపెడుతున్నాడు. ఇప్పుడు మాధవి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ సమస్యకు తగిన పరిష్కారం కోసం భూమిక హెల్ప్ లైన్‍కు ఫోన్ చేసింది మాధవి.
మాధవి సమస్యను అర్థం చేసుకున్న భూమిక హెల్ప్ లైన్ కౌన్సిలర్ తన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పస్త్రుతం మాధవి సమాజం కోసం ఆలోచిస్తుంది కాబట్టి భర్త దగ్గరే ఉండాలని అనుకుంటుంది. కాని తనకు రిటైర్మెంట్ డబ్బులతోపాటు, భర్తనుండి తన బాధను తొలగించే మార్గాన్ని చూపమంది. వెంటనే హెల్ప్ లైన్ మాధవికి ధైర్యాన్ని చెప్పి రిటైర్మెంట్ డబ్బులో ఆమెకు సగం వాటా వుందని చెప్పి, మరల భూమిక హెల్ప్ లైన్ ప్యానల్ అడ్వకేటు శ్రీమతి కాంతి గారి ద్వారా తనకు కావలసిన సమాచారాన్ని అందచేసాం. మాధవి సమాజం కోసం తన భర్త దగ్గర వుంటనే అంటే ఒకే ఇంట్లో వుంటూ సపరేట్ అయ్యే విధంగాను, అలా చేయడం వలన తను ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యనుండి తాత్కాలికంగా దూరంగా వుంచడం జరిగింది. పస్త్రుతం ఆమె తన పిల్లలతో సంతోషంగా వుంటోంది.
Wednesday, March 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment