Tuesday, July 29, 2008

భూమిక హెల్ప్‌లైన్‌ -2వ సం. సమీక్షా సమావేశం


భూమిక హెల్ప్‌లైన్‌ -2వ సం. సమీక్షా సమావేశం


హిమజ

భూమిక ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది - ఎల్లుండి ఏప్రిల్‌ 19న భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగు వుంది రమ్మని. పోయిన సంవత్సరం వెళ్ళడానికి కుదరలేదు. ఈసారి వస్తాననే చెప్పాను.

19 ఏప్రిల్‌ ఉదయం తొమ్మిది గంటలకల్లా భూమిక ఆఫీసుకి రచయిత్రులు, భూమికని అభిమానించే రైటర్స్‌ కానివారు అందరూ చేరుకున్నారు. ఒక పెద్ద బస్సే మాట్లాడారు భూమిక బృందం - తొమ్మిదిన్నరకల్లా బస్సు కదిలింది. ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి రిసార్ట్స్‌లో మీటింగు. హబ్సిగూడాలో, ఉప్పల్‌లో మరికొంత మంది ఎక్కారు. బస్సు కొంత దూరం సాగగానే సత్యవతిగారు తెచ్చిన సంపెంగల్ని ఆమె స్నేహితురాలు గీత అందరికీ పంచారు. గాఢమైన సంపెంగవాసనల్తో జోకుల్తో నవ్వుల్తో ప్రయాణం సాగింది. వెనకనుంచి ఎవరో గానీ మొలకెత్తిన విత్తనాల్తో పాటు కాస్త ఆరోగ్య స్పృహని కూడా అందరికీ పంచారు.
రిసార్ట్స్‌ చేరుకున్నాం. లోపలికి అడుగుపెడుతుంటే తలకి తగిలేలా చేతులకి అందేలా వున్న వేపకొమ్మలు వేపపూల జల్లులు కురిపించాయి. అందరూ చిన్నపిల్లల్లా కేరింతలు. ‘మల్లెపూలవాన… కాదు… కాదు ‘వేపపూలవాన’ అంటూ పాటందుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌, టీ, కాఫీలు అయ్యాక మాకు రిజర్వ్‌ చేసిన కాన్ఫరెన్స్‌ హాల్లోకి వెళ్ళాం. ప్రసన్న, లక్ష్మి చకచకా బ్యానర్స్‌ అంటించేసారు. ఆక్స్‌ఫామ్‌ గిరిజ రావడానికి ఇంకో అరగంట పట్టొచ్చేమో - అందాకా సరదాగా ఎవరైనా పాటలు పాడకూడదూ అన్నారు సత్యవతి. తన కమ్మని గొంతుతో పార్వతీ పృధ్వి ‘యే గయా సమయే హై ప్యార్‌కా… కిసీకె ఇంతెజార్‌కా'’ అని ‘’తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ'’ అని రెండు పాటలు పాడింది. ‘నీటిలోనా నింగిలోనా నీవే వున్నావులే’ అని హిమజ అందుకోగానే అందరూ ఆ పాటని విపరీతంగా ప్రేమించేసి గొంతు కలిపారు. నిజంగా ఈ మధ్యకాలంలో ఈ పాట ఎక్కడా వినబళ్ళేదు అనుకున్నారు సత్యవతి. అది మొదలు అందరి మనసుల్లో దాక్కున్న పాత మెలొడీ పాటలన్నీ అందరి గొంతుల్లోంచి పల్లవించాయి. కొండేపూడి నిర్మల, గీత ‘గోదారి గట్టుందీ…’ అంటూ అందరినీ హుషారెత్తించారు. వారణాసి నాగలక్ష్మి పాటకి బదులుగా ‘’అదేగా పాటంటే… పాట నింగై ఆవరించాలి… శోకమెరుగని నాగలోకం చేరుకోవాలి'’ అంటూ పాట గురించిన కవిత చదివారు.
అందరికీ స్వాగతం చెబుతూ సత్యవతి - ‘ఇది సీరియస్‌ మీటింగేమీ కాదు, చాలా ఇన్‌ఫార్మల్‌గా జరిగే మీటింగే. భూమిక హెల్ప్‌లైన్‌ మొదలయ్యి రెండు సంవత్సరాలవుతోంది. రెండో సంవత్స రంలో హెల్ప్‌లైన్‌ ఏం చేసింది ఒకసారి సమీక్షించుకుందాం. అందరూ సలహాలు సూచనలు ఇవ్వండి’ అంటూ ఈ సంవత్సర కాలంలో హెల్ప్‌లైన్‌ వేర్వేరు ఏరియాలకి వెళ్ళిందని, స్త్రీల సమస్యలపైనే కాకుండా వేర్వేరు అంశాలను హెల్ప్‌లైన్‌ చేపట్టిందని, హెల్ప్‌లైన్‌ కౌన్సిలింగు ద్వారా కొన్ని ఆత్మహత్యలని కూడా నివారించగలిగామని చెప్పారు.
పెళ్ళై విదేశాలకి వెళ్ళిన ఒకమ్మాయి భర్తపెట్టే హింస మితిమీరిపోయింది. అమెరికా ప్రభుత్వం ఆమె పాస్‌పోర్ట్‌ని సీజ్‌ చేసింది. ఎయిర్‌పోర్ట్‌కి వస్తే అరెస్టు అయ్యే పరిస్థితి ఆమెది. ఇండియాకి రాలేదు, అక్కడ ఉండలేదు. చివరికి ఆ అమ్మాయి భూమిక హెల్ప్‌లైన్‌ని సంప్రదించింది. రెండుమూడుసార్లు మాట్లాడాక ఆమెకి తన వివరాలను గోప్యంగా వుంచుతారన్న నమ్మకం కలిగింది. సర్వశక్తులు పెట్టి ఆమెని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే మీటింగుకి ఆ అమ్మాయి వచ్చినా ఆశ్చర్యం లేదు అని చెప్పారు సత్యవతి. అయితే హెల్ప్‌లైన్‌కి ఇంకా మానవవనరులు కావాలి. మనకున్నది ఒకే టోల్‌ఫ్రీ లైను. మే నెలలో ఇంకో లైను రాబోతోంది. ఆ లైనుని కూడా హాండిల్‌ చేయాలంటే మానవవనరుల అవసరం బాగా ఎక్కువవుతుంది. మనసులోని సొద ఓ పది నిమిషాలు వినే మనిషి కూడా దొరక్క ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఆశ్చర్యమే లేదు. హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి ఓ అరగంట వాళ్ళ వేదన, దుఃఖం పంచుకున్నాక వాళ్ళ ఉద్వేగ తీవ్రత సగానికి సగం తగ్గిపోతుంది. అప్పుడు మంచిమాటలు చెప్పినా వినే పరిస్థితి వారికి వస్తుంది. అందువల్ల ఎన్నో ఉపద్రవాలు తప్పే అవకాశం వుంటుందన్న సత్యవతి మాటల్తో అందరూ ఏకీభవించారు.
వ్యవస్థల్ని పని చేయించడంలో మనం విఫలమవుతున్నాం అని ఆక్స్‌ఫామ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ గిరిజ అభిప్రాయపడ్డారు. ఒరిస్సాలో ఆక్స్‌ఫామ్‌ షార్ట్‌ స్టే హోమ్స్‌లో లాగా మన దగ్గర కూడా ప్రెషర్‌గ్రూప్స్‌గా తయారవ్వాలి. భూమిక హెల్ప్‌లైన్‌ పాత్రే కాకుండా ఇంకా విస్తృతపరచుకోవాలి అని ఆకాంక్షించారు. ఇప్పటికే చాలా మంది స్త్రీలు హెల్ప్‌లైన్‌ని ఉపయెగించుకుంటున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత విస్తృతం అవుతుంది అని అనుకోలేదు. విభిన్న వ్యక్తులని ఒక తాటిపైకి తీసుకురాగలిగే సామర్ధ్యం సత్యవతిలో వుంది.
గ్రామీణ పేద ప్రజలకి మన సేవలు అందాలి. ఎగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి స్త్రీలకి చేరాలి. ఇంకా సమగ్రంగా 24 గంటల హెల్ప్‌లైన్‌గా మారాలి. ఒకసారి ప్రచారం చేసాక చేయలేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంకో టోల్‌ఫ్రీ లైను, మరికొంత మంది వాలంటీర్లను సమకూర్చుకున్నాకే ప్రచారం చేద్దాం'’ అన్నారు గిరిజ. ‘వెలుగు’ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న గ్రామీణ మహిళలు చక్కగా హెల్ప్‌లైన్‌ సేవల్ని వినియెగించుకుంటున్నారని ఆమె చెప్పారు.
మనసులోని మాట చెప్పుకున్నా వినే వెసులుబాటు లేని చోట స్త్రీలు హెల్ప్‌లైన్‌ని చాలా ఉపయెగించుకుంటున్నారు. మనసులో వ్యధ విన్నంత మాత్రాన్నే సగానికి సగం రిలీఫ్‌గా ఫీలవుతారు. స్వాంతన పొందుతారు. ప్రేమపూర్వక పరామర్శతో ఎన్నో క్లిష్టసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చారు గిరిజ.
హెల్ప్‌లైన్‌ విస్తృతం కావాలంటే - జిల్లాల్లో అయితే స్థానికంగా ఒక అండ అంటూ వుండాలి. వరంగల్‌లో ఒక ముసలి దంపతులిద్దరూ, నడవలేని స్థితిలో వున్నారు. ఒక కొడుకు అమెరికాలో వున్నాడు. ఇక్కడున్న కొడుకు తల్లిదండ్రులను చూసుకోవడం కాకుండా చంపేలాగా వున్నాడని అమెరికాలో వున్న కొడుకు భూమికకి ఇ-మెయిల్‌ ద్వారా తెలిపితే హెల్ప్‌లైన్‌ త్వరగా స్పందించి అక్కడ వున్న రచయిత్రి అనిశెట్టి రజిత ద్వారా, ఆ వృద్ధులకు కావలసిన సాంఘిక మానసిక స్థైర్యాన్ని సమకూర్చింది. ప్రాణభయం నుంచి బయటపడ్డారు వాళ్ళు. ఇలా హెల్ప్‌లైన్‌ విస్తృతం కావాలంటనాకెంతో ధైర్యం. మీరెవరూ ఏమీ చేయడం లేదని అనుకోవద్దు. సమయం వస్తే స్పందించడానికి సహకరించడానికి మీరంతా సిద్ధంగానే వున్నారని నాకు తెలుసు. హెల్ప్‌లైన్‌ ద్వారా చిట్టచివరి నిమిషంలో చాలా మందిని రక్షించగలిగాం. జీవితాలను సమూలంగా మార్చలేం గానీ బతకడానికి ఎన్నో మంచి దారులున్నాయి. జీవితానికి ఎన్నో కోణాలున్నాయి. దానివైపు అన్వేషించండి అని బాధితులకి పెనుచీకటిలో దిశానిర్దేశం చేసే చిన్ని చిరుదీపం హెల్ప్‌లైన్‌ అని చెప్పారు సత్యవతి.
హెల్ప్‌లైన్‌ ఫోన్ల నిర్వహణ చూస్తున్న నాగమణి, కల్పన కూడా మాట్లాడితే బాగుంటుందని అందరూ సూచించారు. దానికిగాను కల్పన చెప్పిందిలా - ప్రేమ వ్యవహారాల్లో విఫలమై ప్రేమికునిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఒక కసితో కొంతమంది ఫోన్లు చేస్తుంటారట. వాళ్ళని బాధలూ వెళ్ళగక్కేలా చెప్పనిచ్చి, జీవితంలో చేరాలనుకునే కొన్ని గమ్యాలుంటాయి. ఎన్నో ఎత్తులుంటాయి. ఆవేశంలో ప్రతీకారేచ్ఛతో సాధించేదేమీ వుండదు అని కౌన్సిలింగు చేసిన యువతులు ఇవాళ మంచిస్థాయిలో వున్నారని చెప్పింది.
నాగమణి మాట్లాడుతూ - హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసినవారి అవసరాలకి అనుగుణంగా పానెల్‌ అడ్వకేట్స్‌కి గానీ, ఫామిలీ కౌన్సిలర్‌కి గానీ సూచిస్తాం. జిల్లాల నుంచి అయితే అక్కడున్న కౌన్సిలింగు సెంటర్స్‌కి లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలని సూచిస్తాం. అవసరమైతే హ్యూమన్‌ రైట్స్‌ కమీషన్‌కీ పంపిస్తాం అంది. చిన్నవయస్సు పిల్లలైనా నాగమణి, కల్పనలు హెల్ప్‌లైన్‌ కౌన్సిలింగు నిర్వహించే తీరు, పరిపక్వత చెందిన మాటతీరుపై అందరూ ప్రశంసలు కురిపించారు.
భూమికతో తమ తమ అనుబంధాన్ని రచయిత్రులు కానివారు కూడా మననం చేసుకున్నారు. ‘’విరసంలో సభ్యురాలినైనా నాకు భూమిక హెల్ప్‌లైన్‌ అంటే చాలా అభిమానం. హెల్ప్‌లైన్‌ ద్వారా లబ్ది పొందిన వాళ్ళు తిరిగి హెల్ప్‌ లైన్‌కి తమ సేవలు అందించే విధంగా బాధితులని కార్యకర్తలుగా మార్చడం అనేది ఒక ఓరియంటేషన్‌గా అభివృద్ధి చేయలి'’ - అని రత్నమాల అభిప్రాయపడ్డారు.
సుజాతా పట్వారీ మాట్లాడుతూ - ‘’హెల్ప్‌లైన్‌ ట్రైనింగు ప్రోగ్రాంకి వెళ్ళాను. ఎన్ని ఫోన్‌కాల్సో చెప్పలేను. చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళ అవేర్‌నెస్‌ చూస్తే, మనం ఎంతో చేయగలిగినవాళ్ళం చాలా తక్కువ చేస్తున్నామనిపించింది. నా మేరకు నేనేం చేస్తున్నానని ప్రశ్నించుకున్నాను'’ అన్నారు.
జి. విజయలక్ష్మి - మాట్లాడుతూ పది సంవత్సరాలుగా భూమికతో అనుబంధం వుంది. పత్రికలో పని చేస్తున్నప్పుడు చాలామంది స్త్రీలు, రచయిత్రులు రాస్తారు కనుక ఏమైనా పరిష్కారం చూపించమని వచ్చి అడిగేవాళ్ళు - నాలుగ్గోడల మధ్య జరిగే గృహహింసకి సాక్ష్యాలేం వుంటాయి. పాతచట్టాలు సరిగా పనిచేయడం లేదు. కొత్త చట్టాలకి బాగా ప్రచారం ఇవ్వాలి అన్నారు.
1976-80ల మధ్యకాలంలో లిబియాలో మేం వున్నప్పుడు అక్కడి స్త్రీలు ఒళ్ళంతా తెల్లదుప్పటి కప్పుకొని కేవలం ఒకే కన్ను బయటికి కన్పించేలా వస్త్రధారణ చేసేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఘోరంగా వుండేది. స్త్రీలు ఒకరి తర్వాత ఒకరిని కంటూనే పోవాలి. ఒక సంవత్సరం కడుపు రాకపోయినా డాక్టరు వద్దకు తీసుకువెళ్ళేవారు అక్కడి మగవారు. ప్రమాదవశాత్తో, ఏటా బిడ్డల్ని కనడం మూలాన బలహీనమైన పిల్లలు మరణిస్తేనో కూడా బాధపడేవాళ్ళు కాదు అక్కడి మగవాళ్ళు. మళ్ళీ ఇంకొకర్ని కంటుందిలే అనేవాడు భర్త. పశువుల కన్నా హీనంగా తోచే ఈ విషయాలు ఈ ముప్ఫయ్యేళ్ళలో ఏమైనా మారివుంటాయేమో అని లిబియాలో తాము వున్నప్పటి అనుభవాలు పంచుకున్నారు శాంతసుందరి గారు.
సీనియర్‌ రచయిత్రి, అనువాదకురాలు శాంత సుందరి మాట్లాడుతూ నేను హైదరాబాద్‌కి మారక ముందు, ఢిల్లీలో వున్నప్పటి నుంచే భూమికతో, సత్యవతితో పరిచయం అని గుర్తు చేసుకున్నారు. భూమిక నాది అని నేను అనుకుంటానని అన్నారు.
పబ్లిక్‌ లైబ్రరీస్‌లో పని చేస్తూ అప్పుడప్పుడు కవిత్వం రాసే బండారు విజయ ‘గృహ హింస బాధితురాల్ని కాబట్టి వారికోసం నేను ఏమైనా చేయలనుకుంటున్నాను. హెల్ప్‌లైన్‌కి అవసరం అనుకుంటే నా సేవలు వినియెగించుకోవచ్చు’ అన్నారు.
‘సత్యవతి చెబితే వచ్చా’నని రేఖ అనే రీసెర్చర్‌, కొంచెం ఇంట్లోంచి బయటపడాలన్న ఉద్దేశ్యంతో వచ్చానని భాను అనే హోంమేకర్‌ చెప్పారు.
భూమికతోపాటు నేను మళ్ళీ పుట్టానని చెబుతూ డా. సమతా రోష్ని ‘ హెల్ప్‌లైన్‌ వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. మనిషికి మనిషి చాలా దరం అవుతున్న ఈ కాలంలో ఒక్క పదినిమిషాలు ఒక మనిషిని వినగలగడమే ఒక్కోసారి ఆత్మహత్యల్ని కూడా నివారిస్తుంది. హెల్ప్‌లైన్‌కి నా సేవలు తప్పక అందిస్తాను’ అని మాటిచ్చారు.
కొండేపూడి నిర్మల మాట్లాడుతూ ‘భూమికతో నాకు చాలా సన్నిహిత సంబంధం వుంది. కానీ భూమికకు నేను చేసింది చాలా తక్కువ. భూమికకి తప్ప వేరే రాయవా అని ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక ఏడాదిపాటు సీరియస్‌గా అన్ని పత్రికలకూ రాస్తాను’ అన్నారు.
భూమికతో పదేళ్ళుగా అనుబంధం అంటూ, హెల్ప్‌లైన్‌ వరంగల్‌కి కూడా శాంక్షన్‌ అవడం పట్ల హర్షం ప్రకటించారు అనిశెట్టి రజిత.
నల్సార్‌ యూనివర్శిటీలో ఫామిలీ డిస్‌ప్యూట్‌ కోర్సు చేసి హర్షిణి కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్న అనరాధ-సత్యవతి గారితో పరిచయం వలన భూమికలో జాయినైపొండి అని సత్యవతి అనడం వలన వచ్చానని చెప్పుకున్నారు.
భూమిక పత్రికతో పదేళ్ళుగా పరిచయం వుంది గానీ అనుబంధం ఇప్పుడిప్పుడే. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ఏవో రాజకీయలు మొదలవుతాయని, అలాంటివేమీ లేకుండా అన్ని వాదాల వాళ్ళని సులభంగా ఇముడ్చుకొనేలా భూమిక వుంటుందని అందుకు కారణమైన సత్యవతిని చూసి మాత్రమే భూమికతో అనుబంధం పెంచుకుంటున్నానని హిమజ చెప్పారు.
సునంద - 33 సంవత్సరాలు కాలేజీలో పాఠాలు చెప్పి, ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యాక తనలో ఓ శూన్యాన్ని గమనించి - ‘’రేపట్నించి నేనేం చేయలి అనుకునే దశలో భూమికలో బాగా ఇమిడిపోగలనని అన్పించింది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందుగా హింసకి గురయ్యేది మహిళలే. నేను ఒక్కదాన్ని ఏం చేయలేకపోయినా చేసేవాళ్ళ వెనకైనా నిలబడదాం'’ అనుకున్నానని చెప్పారు.
స్త్రీలు వాళ్ళ ఆలోచనల్ని, శక్తిని ఒక సంస్థకి ధారబోసి సమస్యలు పంచుకోవడం పరిష్కారాలకు కృషిచేయడం బాగా నచ్చిందని నాగలక్ష్మి చెప్పారు.
ప్రస్తుతం స్త్రీలకి వున్న బలమైన వేదిక ‘భూమిక’ అని, దాన్ని నిలబెట్టుకోవడానికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడానికి పత్రిక రేటుని కొంతవరకు పెంచవచ్చని కొందరు సూచించారు. జీవితచందా మరికొంత పెంచవచ్చని కూడా సూచించారు.
హెల్ప్‌లైన్‌కి స్వచ్ఛందంగా వారానికి కొన్ని గంటలు పనిచేయడానికి దాదాపు పదిమంది వరకు ముందుకొచ్చారు.
భోజనాలవేళ వరకూ సాగిన సమీక్షా సమావేశం, చేతికి అందుతున్న మామిడికాయల్ని ముట్టుకుంటూ, అబ్బురపడుతూ మామిడితోటలోంచి భోజనాలహాలులోకి వెళ్ళేదాకా ఇలా సాగింది.ే ఎక్కడికక్కడ అందరి సహాయసహకారాలు కావాలి. భూమిక నాది మాత్రమే కాదు, మీ అందరిదీ. మీలో వున్న తపన

Monday, July 28, 2008

A helping hand for women in distress

Newindpress.com




HYDERABAD: It’s an all-women team. They are crusading against violence on women. Their weapon is a magazine.

The five-member team, headed by K Satyavathi, Editor of Streevada Patrika Bhumika, a Telugu monthly, has come up with a toll-free helpline (No 18004252908) service to aid women in distress in the State.

Though the 12-hour free service (8 AM to 8 PM) is meant for its readers, other women can also utilise it. There is already good response to the helpline, which will be formally launched on March 16.

The team has already received more than 2 dozen calls from various parts of the State. Most of the calls are pertaining to harassment for dowry and abuse.

Talking to this , Satyavathi said the gender bias had not declined despite the rise in educational levels among women.

“This forced us to start a helpline. We have an extended network with the Legal Service Authority and other organisations to help women in distress,” she said.

Several Non-Governmental Organisations like Roshni, a city-based counselling centre, and OXFAM have come forward to help them in their endeavour. The other members of the team are Prasanna Kumari (administration in-charge,) M Manjula (does data processing for the magazine), Sudha Rani (assistant) and S Laxmi (circulation in-charge).