Wednesday, March 12, 2008

పరిష్కరించబడిన సమస్యలు - 2

6.11.06 తేదీన హైద్రాబాద్, బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ నుండి ఒక కాల్ వచ్చింది. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని అంటోంది. మీరు ఆ అమ్మాయితో మాట్లాడండి. ఆ కాల్ రాగానే మేము ఆ అమ్మాయి వివరాలు, ఫోన్ నెంబరు తెలుసుకుని వెంటనే ఆమెతో మాట్లాడాం. ఆమెది కూడా ఒక విచిత్రమైన సమస్య.

ఆ అమ్మాయి పేరు వాసవి (పేరు మార్చాం) వాసవి కుటుంబం చాలా ఉన్నతమైనది మరియు ఆర్థికంగా కూడా బాగా స్థితిపరులు. కాని సమస్య ఏమిటంటే వాసవిని ఇంట్లో ఎవరు పట్టించుకోకుండా గృహ నిర్భందంలో వుంచారు. ఆమె వయస్సు 30 సం. ఇంకా పెళ్ళి చేయలేదు. మొదట్లో ఆమె బెంగుళూరుకు చెందిన ఒక యువకుడిని పేమ్రించానని, అతనంటే అమ్మనాన్నలకు ఇష్టం లేదు. వారికి మీరైనా చెప్పి, పెళ్ళి జరిగేటట్లు చేయండి అని పాధ్రేయపడింది. అలా వాసవి దగ్గర నుండి సమస్యను తెలుసుకునే ప్రయత్నంలో భూమిక హెల్ప్ లైన్ ఆమెతో ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడింది, ధైర్యాన్ని చెప్పింది. దానితోపాటుగా ఆమెలో ఉన్న ఆత్మహత్య ప్రయత్నం అనే ఆలోచననుండి విరమింప చేసింది.
అసలు సమస్య ఏమిటంటే వాసవి ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు, మాటల సందర్భంలో ఆమె నాన్న, తనకి తొందరగా పెళ్ళి చేసి పంపేస్తే తన బాధ్యత తీరిపోతుందని అన్నాడట. అప్పటినుండి అమ్మనాన్నల మీద, వారికి వత్తాసు పలికే తన తమ్ముడి మీద ద్వేషం పెంచుకుంది. అంతేకాకుండా తనకి పెళ్ళి చేస్తే, పెళ్ళయిన వెంటనే విడాకులు తీసుకుంటుందని ఎవరో జోస్యం చెప్పగా తల్లిదండుల్రు ఆమెకు 30 సం పైన వున్నా ఇంతవరకు పెళ్ళి ప్రస్తావన తేవడం లేదు. దీనితో వాసవి డిప్రెషన్‍కు లోనయ్యింది.

కౌన్సిలర్ వాసవి సమస్యను హెల్ప్లైన్ కో-అర్డినేటర్‍కు వివరించడం జరిగింది. కో-అర్డినేటర్ వాసవి అమ్మగారితో మాట్లాడారు. అయినా వాసవి పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ లోగానే వాసవి ఇంట్లో వున్న వెండి వస్తువులతో ఇంటినుండి బయలు దేరి బెంగుళూరు వెళ్ళిపోయింది. . ఈమె అక్కడున్నపుడే వాసవి తల్లి అమ్మమ్మ, మేనమామ వాసవి మీద కేసు పెట్టి, ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకురావడానికి పయ్రత్నించారు. ఈ దశలో కో ఆర్డినేటర్ కల్పించుకుని, బెంగళూరు పోలీస్ స్టేషన్‍కు ఫోన్ చేసి వాసవి మీద కేసు అన్యాయమైందని, ఆమె మేజర్ కనుక తన ఇష్టం వచ్చినట్లుగా వుండే హక్కు ఆమెకు వుందని, ఆమెను వదిలి పెట్టమని కోరడం జరిగింది. ఆమె తల్లితో మాట్లాడి తల్లీ కూతుళ్ళ మధ్య రాజీ చేయడం జరిగింది. వాసవి పేరు మీద వున్న పెద్ద మొత్తం బ్యాంకు డిపాజిట్లు ఈ కేసులో కీలకపాత వహించాయి.

వాసవి కేసు ద్వారా భర్త నుండే కాకుండా తల్లిదండ్రుల నుండి ఆడపిల్లలు గురవుతారని అర్థమౌతుంది.

కొన్ని పరిష్కరించబడిన సమస్యలు - 1

భూమిక హెల్ప్ లైన్‍కు రకరకాల కేసులు వస్తాయి. అందులో ముఖ్యంగా కొన్ని :

కుటుంబ హింసకు సంబంధించినవి,వివాహేతర సంబంధాలు, విడాకులు, భర్త / అత్త మామల వేధింపులు, రెండో పెళ్ళి, భర్త చేతిలో లైంగిక వేధింపులు, మద్యపాన వ్యసనం, ప్రేమ సంబంధాలు, పిల్లలపై జరుగుతున్న హింసలు, ఆరోగ్యం, విద్య / మార్గదర్శకత్వం, మనోవర్తి , ట్రిఫికింగ్ కేసులు, బాల కార్మికులు మొదలైనవి.

భూమిక హెల్ప్ లైన్‍కు ఎంతో మంది, ఎన్నో రకాలైన సమస్యలతో ఫోన్స్ చేస్తారు. వాటి తీవ్రతను గమనించిన హెల్ప్ లైన్ వారికి సలహా, సమాచారాలు అందించి సమస్య నుండి ముందుకు నడిచే వర్గాన్ని చూపించింది. ఆ సమస్యలలో కొన్ని ఉదా :-

సేవార్ధి పేరు మాధవి (పేరు మార్చాం) ఆమె హైదాబ్రాద్ నివాసి, ఆమె భర్త రైల్వే డిపార్ట్ మెంట్‍లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమెకు పెళ్ళి జరిగి 30 సంలు, ఆమెకు ముగ్గురు పిల్లలు. మాధవి సమస్య ఏమిటంటే : ఆమె భర్తకు సెక్సువల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువ, కాని అతనికి ఆ సామర్ధ్యం లేదు. కనుక బయట దొరికిన కొన్ని పరికరాలను కొని తీసుకువచ్చి వాటిని ఉపయెగించి తృప్తి చెందుతాడు. కాని ఈ బాధను భరించేది మాత్రం మాధవి. అతను తెచ్చిన పరికరాలను ప్రతీ సారి ఆమె విరగకొట్టడం, అతను తిరిగి కొత్తవి కొనటం. ఇది గత కొన్ని సంలుగా జరుగుతూనే వుంది. ఈ విధంగా తన భర్త ఆమెపై రాక్షసంగా, కూర్రంగా పవ్రర్తించడం వలన మాధవి మానసికంగా, శారీరకంగా చాలా బలహీనమైంది. దీనికితోడు ఆమె భర్త త్వరలో రిటైర్ అవ్వబోతున్నాడు. ఆ రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులు కావాలంటే ఆమె తన భర్త చెప్పిన విధంగా చేయలని చేయకపోతే డబ్బులు. ఇవ్వడని భయపెడుతున్నాడు. ఇప్పుడు మాధవి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ సమస్యకు తగిన పరిష్కారం కోసం భూమిక హెల్ప్ లైన్‍కు ఫోన్ చేసింది మాధవి.

మాధవి సమస్యను అర్థం చేసుకున్న భూమిక హెల్ప్ లైన్ కౌన్సిలర్ తన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పస్త్రుతం మాధవి సమాజం కోసం ఆలోచిస్తుంది కాబట్టి భర్త దగ్గరే ఉండాలని అనుకుంటుంది. కాని తనకు రిటైర్మెంట్ డబ్బులతోపాటు, భర్తనుండి తన బాధను తొలగించే మార్గాన్ని చూపమంది. వెంటనే హెల్ప్ లైన్ మాధవికి ధైర్యాన్ని చెప్పి రిటైర్మెంట్ డబ్బులో ఆమెకు సగం వాటా వుందని చెప్పి, మరల భూమిక హెల్ప్ లైన్ ప్యానల్ అడ్వకేటు శ్రీమతి కాంతి గారి ద్వారా తనకు కావలసిన సమాచారాన్ని అందచేసాం. మాధవి సమాజం కోసం తన భర్త దగ్గర వుంటనే అంటే ఒకే ఇంట్లో వుంటూ సపరేట్ అయ్యే విధంగాను, అలా చేయడం వలన తను ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యనుండి తాత్కాలికంగా దూరంగా వుంచడం జరిగింది. పస్త్రుతం ఆమె తన పిల్లలతో సంతోషంగా వుంటోంది.

Tuesday, March 11, 2008

ఇందిరా క్రాంతి పధం స్త్రీలకు శిక్షణ:

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న (ప్రపంచబ్యాంకు ప్రాజెక్టు) ‘ఇందిరా క్రాంతి పధం’ పథకం కింద లక్షలాది మంది స్త్రీలు సమీకృతులై వున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోను, దశలవారీగా మండల కేంద్రాల్లోను హెల్ప్లైన్ ప్రారంభించాలన్నది వారి నిర్ణయం. ప్రపంచం బ్యాంకు ప్రతినిధి వరలక్ష్మి, జమున గార్లు హెల్ప్ లైన్‍కు వచ్చి చూసారు. చాలా ఇప్రెస్ అయ్యారు. వెలుగు గ్రూఫుల్లోని స్త్రీలకు హెల్ప్ లైన్ నిర్వహణలో శిక్షణ నివ్వాల్సిందిగా కోరడం, దానికి మేము అంగీకరించడం జరిగింది. మొదట కరీంనగర్ నుండి వచ్చిన నలుగురు స్త్రీలు వారం రోజుల పాటు మా వద్ద శిక్షణ పొంది వెళ్ళి, కరీంనగర్లో అశ్రిత హెల్ప్లైన్ ప్రారంభించారు. మెదక్ జిల్లా స్త్రీలు కూడా శిక్షణ పొంది వెళ్ళాక హెల్ప్ లైన్‍కు అఫ్లై చేసారు. కొద్ది రోజుల్లో అదీ మొదలవ్వ బోతోంది. ఇప్పటివరకు కరీంనగర్, పశ్చిమగోదావరి, కృప్ణా, మెదక్, చిత్తూరు, నల్గొండ, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన గ్రామీణ స్త్రీలు హెల్ప్ లైన్ ఎలా నిర్వహించాలో నేర్చు కున్నారు. మా దగ్గర నేర్చుకుంటూనే మహిళా కోర్టు, మహిళా పోలీస్ స్టేషన్, కుటుంబ సలహా కేంద్రాలను కూడా దర్శించి వాటి పనితీరును అవగాహన చేసుకున్నారు. ఇందిరా క్రాంతిపధం ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలందరితో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలను కుంటున్నాము. ప్రతి జిల్లా కేంద్రంలోను, మండల కేంద్రాల్లోను హెల్ప్ లైన్‍లను విస్తరించి, సమస్యల్లో వున్న స్త్రీలకు బాసటగా నిలవాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రవనికి రూపకల్పన జరిగింది.హింసాయుతమైన రోజువారీ జీవితం ఈ రోజు స్త్రీల జీవితాలని అతలాకుతలం చేస్తోంది. కుటుంబ హింసకి చదువుకున్న, చదువురాని స్త్రీలు సమానంగానే గురవుతున్నారు. ఈనాటి వేగవంతమైన జీవిత విధానం పక్కవారి కేమి జరుగుతుందో పట్టించుకోనివ్వడం లేదు. మనిషి ‘’మేము'’ లోంచి అతివేగంగా ‘’నేను'’లోకి జారి పోతున్నాడు. ఈ ‘’నేను'’ లందరు ఒంటరి ద్వీపాలవుతున్నారు. ఎవరి గురించి ఎవ్వరు పట్టించుకోని ఈ పరిస్థితుల్లో బాధిత స్త్రీలకు అండగా వుండేది భూమిక హెల్ప్లైన్లాంటి చిరు సహాయలే. కరీంనగర్ నుంచి వచ్చిన ఓ గ్రామీణ మహిళ మాటల్లో చెప్పాలంటే ‘’భూమికలో మీరు ఒక చిరుదీపం వెల్గించారు. మేము ఈ దీపంను ముట్టించుకుని మా కరీంనగర్ తీసుకెళ్ళి జిల్లా అంతా వెలిగిస్తాం.'’అన్నట్టుగానే వారు తమ హెల్ప్ లైన్‍ను ప్రారంభించుకున్నారు.

హెల్ప్ లైన్ ప్రాసెస్

సి.హెచ్. నాగమణి, పి.కల్పన, కౌన్సిలర్స్

సమస్యల్లో వున్న స్త్రీల కోసం ప్రారంభించిన భూమిక హెల్ప్ లైన్‍కు మొదట ఫోన్ కాల్ రాగానే, కౌన్సిలర్ కాల్‍ను రిసీవ్ చేసుకుని హలో భూమిక హెల్ప్ లైన్ అని అంటారు ఆ మాట సేవార్థికి నమ్మకం కలిగించే విధంగా వుండాలి. సేవార్థితో సంబంధాన్ని ఏర్పరుచుకుని, సమస్య తీవ్రత, సందర్భాన్ని, సేవార్ధి భావాలను అంచనా వేసి సమస్యను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అందచేయలి. సేవార్ధి తన సమస్యపై తనకు అవగాహన కలిగేలా వివరించాలి. సమస్య తీవ్రతను బట్టి ఒక్కొక్క కాలర్కి 15 నిల నుండి 60 నిల వరకు సమయం తీసుకుంటాం. సేవార్ధికి తన సమస్యపై అవగాహన కలిగిన తరువాత వారికి తగిన విధమైన పరిష్కార మార్గాలు అందిస్తాం. సేవార్ధి స్వీకరించి ఆచరిస్తారు. ఉదా :- ఒక సేవార్ధి తన అత్తమామ, భర్తతో వరకట్న వేధింపులకు గురిఅవుతుందని హెల్ప్ లైన్‍కు కాల్ చేస్తే ఆ హింసకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఆమెకు పెళ్ళి అయిన దగ్గర నుండి పుట్టింటి వారు ఎంత కట్నం ఇచ్చారు, ఎందరు పిల్లలు, పెళ్ళయిన దగ్గరనుండి భరిస్తున్న యెడల అది మీ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది. పెళ్ళయిన దగ్గరనుండి కాకుండా పిల్లలు పుట్టిన దగ్గరనుండి అయితే ఆ సేవార్ధి జన్మించిన పిల్లల వివరాలు, అమ్మాయి పుట్టిన దగ్గరనుండి ఈ విధమైన హింసను ఎదుర్కొంటున్నారా? సేవార్ధి భర్త ఏమి చేస్తూ వుంటారు? ఆర్ధిక ఇబ్బందులు ఏమైనా వున్నాయ? లేదా భర్త అతని తల్లిదండ్రుల ప్రభావంలో వున్నాడా? లేక అత్తమామ బాగానే వుండి కేవలం భర్త ద్వారానే ఈ హింసకు గురి అవుతున్నారా? మొదలైన ప్రశ్నలు అడిగి తెలుసుకున్న తరువాత, ప్రస్తుత సమస్యకు సేవార్ధి అభిప్రాయన్ని తెలుసుకుంటాం.

ఒకవేళ సేవార్ధి భర్తనుండి విడిపోవాలని గాని, లేదా అతనిని వర్చుకునే అవకాశం వుందా అనిగాని, లేదా తాత్కాలికంగా విడిపోయి అతని దగ్గరనుండి మనోవర్తి పొందాలని గాని, లేదా భర్తపై కేసు పెట్టాలని గాని లేదా కేసు పెట్టిన తరువాత ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురై కోర్టు ఫీజులు చెల్లించలేనని గాని లేదా అత్తమామల నుండి విడిపోయి జీవిస్తే ఆమె భర్తలోమార్పు వస్తుందని గాని ఇలా ఏవిధంగానైనా సేవార్ధి తన అభిప్రాయన్ని వ్యక్తం చేసినట్లయితే దానికి తగిన విధంగా భూమిక హెల్ప్ లైన్ ఫోన్ ద్వారా సేవార్ధికి సలహా మరియు సమాచారాన్ని అందచేస్తుంది. అంటే సేవార్ధి భర్త నుండి విడిపోవాలని అనుకుంటే ఒక్కసారి కుటుంబ సలహా కేంద్రంలో కౌన్సిలింగునకు వెళ్ళి సలహాను తీసుకున్న తరువాత విడాకులకు వెళ్ళమని సలహా యిస్తుంది. ఎందుకంటే ఆమె తీసుకున్న నిర్ణయంవలన ఆమె పిల్లలు బాధ పడకూడదు, మరియు వారి భవిష్యత్తులో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకూడదనే ఉద్దేశ్యంతో, మరియు ఆమె నిర్ణయానికి గౌరవం యిచ్చి అడ్వకేటు సలహా ద్వారా ముందుకు వెళ్ళమని చెప్తాం. అంతేకాకుండా అడ్వకేటు అవసరం లేదు అని అనుకుంటే స్వయంగా సేవార్ధి, కుటుంబ న్యాయస్థానానికి వెళ్ళవచ్చునని, స్వయంగా తన సమస్యను తానే జడ్జి గారి ఎదుట వ్యక్తం చేయవచ్చుననే సమా చారం యిస్తూ యిక మీదట అంటే కుటుంబ న్యాయస్థానంకు వెళ్ళిన తరువాత ఏదైనా అవసరం ఉన్నట్లయితే మరలా కాల్ చేయమని చెప్తూనే భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నందుకు సిద్ధంగా వుంటేగనక లోక్అదాలత్ ద్వారా కూడా విడాకులు తీసుకునే సౌకర్యం వుందనే సలహా కూడా యివ్వడం జరుగుతుంది.

అలాకాకుండా తాత్కాలికంగా విడిపోయి, మనోవర్తి పొందాలని అనుకున్నా లేదా కేసు పెట్టాలని అనుకున్నా వారికి గృహహింసచట్టం గురించిన సమాచారాన్ని అందచేసి దాని ద్వారా కేసు ఫైల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో అన్ని వెసులుబాటులు కల్పించారనే సమాచారం అందిస్తూ ఆయ జిల్లాలకు సంబంధించిన రక్షణ అధికారి ఫోన్ నంబర్లు యిస్తూ సలహాను అందిస్తాం. ఒకవేళ కేసు పెట్టినప్పటికి సేవార్ధి ఆర్థిక సమస్యల కారణంగా కేసు ముందుకు నడవలేకపోతే ఫ్రీలీగల్ ఎయిడ్ కు వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకుంటే లీగల్ ఎయిడ్ వాళ్ళు ఒక అడ్వకేటును ఏర్పాటు చేసి కేసును ముందుకు నడిపిస్తారు. ఈ లీగల్ ఎయిడ్ హైకోర్టులోను జిల్లా కేంద్రాల్లోను వుందనే సమాచారం యిస్తాం.

అంతేకాకుండా అత్తమామల నుండి విడిపోయి భర్తతో కలసి విడిగా వుండాలని, అతనిలో మార్పు వస్తుంది అనే నమ్మకం సేవార్ధికి ఉన్నట్లయితే వారికి దగ్గరలో వున్న కుటుంబ సలహా కేంద్రాల అడ్రసు లేదా ఫోన్ నెంబర్లు ఇస్తాం. లేదా తను ఇంట్లో వుండి స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేయలని అనుకుంటే వారి జిల్లాలోవున్న మహిళా ప్రాంగాణాల అడ్రసు, ఫోన్ నెంబరు ఇస్తాం.ఇలా సేవార్ధి అభిప్రాయన్ని బట్టి వారికి తగిన విధమైన సలహా, సమాచారాన్ని, సమస్యను బట్టి సాధ్యమయినంతగా ఫోన్లోనే కౌన్సిలింగ్ చేసి వారికి పరిష్కారవర్గాలను చూపిస్తాం.

ఈ పరిష్కార మార్గాలు పూర్తిగా సేవార్ధి అభిప్రాయం మీదనే ఆధారపడతాయి. అంతేకాని సేవార్ధి సమస్యకు కౌన్సిలర్ తన అభిప్రాయన్ని రుద్దటం జరగదు. కౌన్సిలింగ్ సూత్రాలలో నాన్-జడ్జిమెంటల్ అటిట్యూడ్( తీర్పరితనంతో మెలగక పోవడం) చాలా ముఖ్యమైనది. ఈ సూత్రం ఆధారంగానే సేవార్ధి అభిప్రాయన్ని దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ తన సలహాలను ఇవ్వాలి. యిచ్చిన సలహాను ఏవిధంగా అమలు చేసుకున్నారో మరలా ఆ సమస్య ఫలితం కోసం హెల్ప్లైన్ ఫోన్ చేసి ప్రతిస్పందన యివ్వమని చెప్తాం, దానినే ఫాలో-అప్ కేసెస్ గా చెప్తాం. ఈ ఫాలో-కేసెస్లో చాలా వరకు పరిష్కారం జరిగిన కేసులు వుంటాయి.

పెనుచీకటిలో చిరుదీపం

2006 మార్చి 16న భూమిక హెల్ప్ లైన్ ప్రారంభమైంది.

ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సమాచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది.

అసలు ఈ హెల్ప్ లైన్ ప్రారంభించాలన్న ఆలోచన ఎలా కలిగిందని చాలామంది అడుగుతుంటారు. మీకందరికి తెలుసు 1993 నుండి భూమిక పత్రిక విజయ వంతంగా నడుస్తోంది. పత్రికలో వుంటనే మేము ఇంతకు ముందు ఎన్నో కేసులు చేసిన అనుభవాలున్నాయి. మంజులా చౌదరి కేసు, హైకోర్టు అడ్వకేట్ సంగీతా శర్మ కేసు లాంటి ఎన్నో కేసులకు సంబంధించిన ఉద్యమాల్లో మేము పాల్గొన్నాము. పత్రిక ఫోన్ నెంబర్‍కు ఎంతోమంది స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యల పరిష్కారం కోసం సలహాలడిగేవారు. సమాచారం అడిగేవారు. అప్పటికి నా వద్ద అలాంటి ఏర్పాటు లేకపోవడంవల్ల ఎవరైనా మాకు ఫోన్ చేస్తే, ఆయ సమస్యల మీద పని చేసే సంస్థలకు, వ్యక్తులకు ఆ కేసుల్ని అప్పగించేవాళ్ళం.

క్రమంగా ఇంత మంది స్త్రీలకి హెల్ప్ అవసరం వుందన్న విషయం అర్ధమై మనమే ఎందుకు ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చెయ్యకూడదు అన్పించింది. భూమిక లాంటి చిన్న సంస్థకు సాధ్యమయ్యే పని కాదు. వెంటనే ఆక్స్ఫామ్ గిరిజతో ఈ విషయమై చర్చించాను. తను చాలా పాజిటివ్‍గా స్పందించింది. ప్రపోజల్ పంపించమని కోరింది. ఆ తర్వాత వెంట వెంటనే పనులు జరిగిపోయయి. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినం రోజున ప్రారంభోత్సవం జరపాలనుకున్నాను. అయితే అప్పటికి ఫోన్ కనెక్షన్ రానందున మార్చి 16న ప్రారంభించాం. చాలా మంది మిత్రులు ఈ సమావేశానికి హాజరయ్యరు.

అదే రోజున ఆంధ్రజ్యోతి ‘’నవ్య'’ పేజీలో హెల్ప్ లైన్ ఆవిర్భావం గురించి అర్ధపేజీ కథనాన్ని ప్రచురించడంతో ఫోన్స్ వరదలా వచ్చాయి. మొదటి రోజున 145 కాల్స్ వచ్చాయి. ఈ స్పందన మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక వెనుతిరిగి చూసింది లేదు. ప్రతి రోజూ భిన్నమైన కాల్స్. విభిన్నమైన సమస్యలు. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు హెల్ప్లైన్ పని చేస్తుంది. హెల్ప్లైన్ వచ్చే కాల్స్ రక రకాలుగా వుంటాయి. గృహహింసకు సంబంధించిన కేసులే 80 శాతం వుంటాయి. వరకట్న వేధింపులు, కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాలు, రెండో పెళ్ళిళ్ళులు, ఎన్ఆర్ఐ వివాహ సమస్యలు. ఇంకా అనేక రకాలైన సమస్యలు చెబుతుంటారు. పరిష్కారాలవెదుకులాటలో భూమిక హెల్ప్లైన్ తోడ్పాటు అడుగుతుంటారు.

మేము హైదరాబాద్లో హెల్ప్లైన్ పెట్టుకుని సమస్యల్ని ఎలా పరిష్కరిస్తామనే ఆలోచన మీకు రావడం సహజం. మా కొచ్చే కాల్స్ ఎక్కువ శాతం కేవలం ‘’వినడం'’తోనే ముగుస్తాయి. తమ గుండెల్లో సుడులు తిరుగుతున్న దు:ఖాన్ని విప్పి చెప్పుకునే ఔట్లెట్గా కొంతమంది ఉపయెగించుకుంటారు. తన్నుకొచ్చే బాధని పెదవి అంచుమీదే బిగించి తమ దు:ఖాన్ని పంచుకుంటారు. కాల్ మొదలై నప్పటి ఉద్వేగం, ఉద్రేకం కాల్ ముగిసేటప్పటికి సర్దు కుంటాయి. మాట్లాడే పద్ధతిలో, గొంతులో ఎంతో మార్పు కనబడుతుంది. తీర్పరితనంతో, తప్పులు ఎంచే పద్ధతిలో హెల్ప్ లైన్ మెలగదు కాబట్టి కాలర్ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరగడం గమనిస్తాము. అప్పటి వరకు ‘’తప్పునీదే. నీ వల్లనే ఇదంతా జరిగింది'’ అనే మాటలను విని విని విసిగి హెల్ప్ లైన్‍కి కాల్ చేసినపుడు మనం ఆమె దు:ఖ తీవ్రతని అర్థం చేసుకుని ఆమెకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం వల్ల తన మీద తనకి నమ్మకం, గౌరవం పెరుగుతాయి.

అంటే ‘’వినడం'’ అనేది హెల్ప్లైన్ ప్రధానలక్షణంగా చెప్పొచ్చు. ఇంక సలహా, సమాచారం ఇవ్వడం గురించి- మేము హెల్ప్లైన్ నిర్వహణకు కావలసిన సమాచారం మొత్తం సేకరించి పెట్టుకున్నాం. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లు, న్యాయధికారుల ఫోన్ నెంబర్లు, ప్రొటెక్షన్ ఆఫీసర్ల ఫోన్ నెంబర్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపర్నెంట్లు, ఎమ్.ఆర్వోలు, ఎమ్డివోలు ఇలా ప్రతి జిల్లాకి సంబంధించిన సమాచారం సేకరించుకుని హెల్ప్లైన్ డెస్క్ మీద సిద్ధంగా పెట్టుకున్నాం. ఏ మారుమూల పోలీస్స్టేషన్ కైనా ఫోన్ చేసి మాట్లాడే వెసులుబాటు కల్పించుకున్నాం.
హెల్ప్ లైన్‍లో స్వచ్ఛందంగా పనిచేయడానికి ఎందరో ముందుకు వచ్చారు. అడ్వకేట్లు, సైక్రియాట్రిస్ట్లు మాతో కలిసి పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు అడ్వకేట్స్ నెట్‍వర్క్ వుంది. ఆయ ప్రాంతాల స్త్రీలకు అవసరమైతే వారి ఫోన్ నెంబర్లు , అడ్రస్లు ఇస్తాం. లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ద్వారా ఉచిత న్యాయం అందే వీలు కల్పిస్తాం. లోక్ అదాలత్ సమాచారం అవసరమైన వారికి అందచేస్తాం.

హెల్ప్ లైన్ నెంబరు ప్రాచుర్యం

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియ ద్వారా హెల్ప్ లైన్ నంబరు చాలా ప్రాచుర్యం పొందింది. ఆంధ్రజ్యోతి, ఈనాడుతో సహ అనేక దినపత్రికలు, మ్యాగజైన్లు హెల్ప్ లైన్ నంబర్ రాష్ట్రమంతా తెలిసేలా కథనాలు ప్రచురించాయి. నవ్య, వసుంధరలు చాలా పాప్యులర్ స్త్రీల పేజీలు. ఈ పేజీలలో హెల్ప్ లైన్‍కు స్థానం దొరకడంతో చాలా మంది స్త్రీలకు దీని గురించి తెలిసింది. అలాగే టీ.వి.9, ఈటీవి 2ల స్త్రీల కార్యక్రమం నవీన, సఖిల ద్వారా నంబరు ప్రతి ఇంటికి చేరింది. హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్గా నేనిచ్చిన టీవి షోల ద్వారా కూడా నంబర్ బాగా పాప్యులర్ అయ్యింది. భూమికకి ఎక్సేంజీ కాపీలుగా అందే మ్యాగజైన్లన్నీ తమ వంతు సహాకారాన్ని అందిస్తున్నాయి. స్టిక్కర్లను అతికించడం ద్వారా, కార్డులను పంచడం ద్వారా కూడా నెంబర్‍ని ప్రాచుర్యంలోకి తేగలిగాము.

హెల్ప్ లైన్ ప్రభావం:

భూమిక హెల్ప్ లైన్ విజయవంతంగా నడుస్తూ ఎంతోమంది బాధిత స్త్రీలకు బాసటగా నిలవడంతో చాలామంది తాము కూడా హెల్ప్ లైన్ నడపదలిచామని, మా పనిలో భాగస్వాములు కాదలిచామని ముందు కొచ్చారు. ఇంకా వస్తున్నారు. తెనాలిలో ప్రియబాంధవి అనే ఆవిడ హైదరాబాద్ వచ్చి భూమిక హెల్ప్ లైన్ చూసి ఉత్తేజితురాలై తాను కూడా ఒక హెల్ప్ లైన్ ప్రారంభించారు. అనురాధ, రేవతిలు కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖాముఖి కౌన్సిలింగ్ కావలసిన వారికి ‘హర్షిణి’ పేరుతో నడుస్తున్న ఈ కుటుంబ సలహా కేంద్రానికి రిఫర్ చేయడం జరుగుతోంది. కాంతి గారు న్యాయవాది వృత్తిలో వుంటూ, ప్రతి శనివారం హెల్ప్ లైన్‍లో కూర్చుని న్యాయసహాయం కావలసిన స్త్రీలకు సలహాలనిస్తున్నారు. చాలామంది వివిధ జిల్లాల నుండి స్వచ్ఛంధంగా పనిచేయడానికి ముందుకొచ్చారు. వారందరిని హైదరాబాద్ పిలిచి ఒక వర్కుషాప్ నిర్వహించడం కూడా జరిగింది. ఈ వర్కుషాప్ కు హాజరైన అబ్బూరి ఛాయదేవిగారు ‘’దీనినొక ఉద్యమంలాగా తీర్చిదిద్దారే'’ అన్నారు.

Sunday, March 9, 2008

సఖిలో భూమిక గురించి

2006 జూన్ లో ఈటివి2 భూమిక హెల్ప్ లైన్ మీద సఖి ప్రోగ్రాంలోఒక కధనాన్ని ప్రసారం చేసింది.ఈటివి2 వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మీ కోసం ఈ వీడియో.

Saturday, March 8, 2008

ఫోనులో… సాంత్వన

సమస్యల్లో ఉన్న సోదరీమణుల కోసం భూమిక హెల్ప్ లైన్

1800 425 2908


జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.
కేవలం టెలిఫోన్‌లో మాట్లాడడం ద్వారా కొంతకాలంలోనే ఎంతోమంది జీవితాల్లో వెలుగు తేగలిగిన ఈ హెల్ప్‌లైన్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి అయింది. సంఘసేవ పట్ల ఆసక్తి కల కొందరు ఆయా ప్రాంతాల్లో సొంతంగా ప్రారంభించగా, వెలుగు పథకం కింద జిల్లాల్లో ఇలాంటి హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తరఫునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా నుంచీ ఐదుగురు సభ్యులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా భూమిక హెల్ప్‌లైన్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ గురించి వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ‘వసుంధర’కు వివరించారు.

‘భూమిక’ తోనే మొదలు

‘పదిహేనేళ్లుగా నేను భూమిక పత్రిక ద్వారా స్త్రీ సమస్యలపై పోరాడుతున్నాను. కార్యాలయానికి పలువురు మహిళలు చేసిన ఫోన్లు చూశాక అలాంటి వారికి సాంత్వనిచ్చి..భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ను ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చింది. ఆ యోచన కార్యరూపం దాల్చింది. ఇప్పటిదాకా పదిహేను వందలకు పైగా కేసులను పరిష్కరించాం’అని వివరించారామె.

ఎలా పనిచేస్తుంది?

భూమిక టోల్‌ఫ్రీ నంబరుకి ఫోన్‌ చేస్తే ఫోన్‌ చేసినవారికి బిల్లు పడదు. ఎం.ఎ. సోషల్‌ వర్క్‌ చేసి కౌన్సెలింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఇక్కడ కౌన్సెలర్లుగా ఉన్నారు. ఉదయం ఎనిమిదినుంచి రాత్రి ఎనిమిదింటివరకు ఈ నంబరు సేవలందిస్తుంది. చాలావరకు కేసులకు కౌన్సెలింగ్‌ సరిపోతుందని, నిపుణుల అవసరం ఉన్నప్పుడు మళ్లీ చేయమని చెప్తామని, అవసరమైతే ఇతర కౌన్సెలింగ్‌ కేంద్రాల నంబర్లు, వారి వారి ప్రాంతాల్లో సహాయం అందించగల సంస్థల నంబర్లు కూడా వారికి ఇస్తామని ఆమె చెప్పారు. ఇక్కడ సేవలందించడానికి కొందరు వృత్తి నిపుణులు కూడా తరచూ వస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలనుంచీ ఫోన్లు వస్తుంటాయనీ కోస్తా ఆంధ్రా, గుంటూరు, ప్రకాశం, తదితర జిల్లాలనుంచీ వచ్చేవే అధికమన్నారు. ఎక్కువ శాతం కేసులు గృహహింసకు సంబంధించినవేననీ వివరించారు. అయితే గత రెండు నెలలుగా వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారామె. ఒత్తిడినెదుర్కొంటున్న విద్యార్థినులు, అపరిపక్వ ప్రేమలు వాటి తాలూకు పరిణామాలకు సంబంధించిన కేసులూ ఎక్కువగానే వస్తున్నాయని కార్యకర్తలు వివరించారు.

మంచి పని ఇప్పిస్తానని చెప్పిన బ్రోకరుని నమ్మి గోదావరి జిల్లానుంచి మాల్దీవులకు చేరిందో మహిళ. అక్కడికెళ్ళాక తాను మోసపోయానన్న విషయం తెలిసి .ఎలాగో భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా సంప్రదించింది. తర్వాత ఆమెను క్షేమంగా ఇల్లు చేర్చగలగడం తనకెంతో సంతృప్తినిచ్చిందంటారు సత్యవతి. పాస్‌పోర్టు తదితర పత్రాలేవీ లేకుండా విమానం దిగిన ఆ మహిళను అధికారులు తిరిగి త్రివేండ్రం పంపించేశారు. తెలుగు తప్ప మరో భాషరాని ఆమెను తెలుగు వనితగా గుర్తించి కేరళలోని ఓ స్వచ్ఛంద సంస్థ సత్యవతికి ఫోన్‌ చేసింది. వెంటనే ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకుని, ఛార్జీలకు డబ్బు పంపి, క్షేమంగా ఇల్లు చేరుకునేలా చేశాం. మరో కేసులో అత్యాచారం చేయబోయిన కన్నతండ్రినుంచి ఇద్దరు కుమార్తెలను కాపాడామన్నారు. ఇలాంటి సీరియస్‌ కేసుల విషయంలో పోలీసు అధికారులు, జిల్లాల్లో న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతోనూ సంప్రదించి బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు.

హెల్ప్‌లైన్‌లో…

Bhumika Help Line

* ఫోన్‌ మోగగానే తీస్తారు.
* ఫోన్‌ చేసిన స్త్రీ చెప్పేదంతా సహనంతో, సానుభూతితో వింటారు.
* వివరాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచుతారు.
* కేసుని బట్టి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు తప్ప తీర్పరితనంతో వ్యవహరించరు.
* పరిస్థితి మరీ సీరియస్‌గా ఉందనుకుంటే స్థానిక పోలీసు యంత్రాంగం, కుటుంబహింస చట్టానికి సంబంధించిన రక్షణాధికారి, స్వచ్ఛంద సంస్థలవారిని అప్రమత్తం చేస్తారు.

(సలహా, సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌: 1800 425 2908 సంప్రదించవచ్చు)


Thursday, March 6, 2008

భూమిక .. మహిళల సహాయం కోసం

State with almost three crores of women population, it is pathetic to note that Andhra Pradesh occupies top third place in national crime report pertaining to crimes against women. It is highly alarming that cases pertaining to dowry deaths, harassment for additional dowry, sexual harassment, misuse of latest technology and scientific developments by way of Amino synthesis tests for foetal sex determination (which in most cases leads to female foetocide), suspicion against character, selling female babies, physical molestation, eve –teasing, kidnapping and trafficking and many more such cases.The declaration of International women’s year in 1975 and the follow up of international women decade inspired the hither to not so much organized women’s agitation and women’s activist to figure in a uniform and more systematic way for the cause of women. Andhra Pradesh women also were inspired to strengthen their figure disparity and injustice. The dowry death committee in 1980s has been a milestone in the crusade commencing with agitation concerning the loopholes in law, dowry harassments , dowry deaths, equal pay for
equal work, price raise, equal job opportunities, issues concerning single women and many other such crucial question , the A.P women progressed in raising and dermitoring her voice with Indian women against Gender discrimination. In the process, the women activists could pave way for the emerging of many women centered NGOs which advocated for the cause of women by way of counseling training, capacity - building, net working, research, documentation, women’s studies etc.
Crimes against women are on the rise in Andhra Pradesh . and the increase in cases of harassments and outraging of modesty has reached serious proportions. As per records pertaining to crime against women, the rate of crime has increased. Chattisgarh , Mandhya Pradesh , and Andhra Pradesh are the top three states in the order of national crime rate at 38.4, 24.6 and 24.5 respectively. The overall figures reveal that the states share in the total number of crimes against women is 11.6 percent and is now positioned at number 3 after Uttar Pradesh (11.7%) and Madhya Pradesh (11.6).
Appalling Statistics
• Dowry kills 16 women everyday (National branch of Investigation) almost 2000 suicide deaths are reported every year as a consequence of dowry ( NBI)• Female infanticide is a direct consequence of dowry the latest census data shows that the sex ratio in India has fallen from 945 (1991) to 927(2001) per 1000 males.• Domestic violence is on the rise• Crime against women traditionally includes rape, kidnapping and abduction, dowry death, torture, molestation, sexual harassment, importation of girls, like most offences, crime against women is steadily on the rise in India. Of the total crimes reported in the country 7% constitute crimes against women.
The above figures show the miserable condition of a vast majority of Indian women. The pain, the anguish and the desperation that millions of women have been carrying in their heads in the country.
The picture in Andhra Pradesh is also the same. Crimes against women are on the rise in Andhra Pradesh. Murders, deaths, rapes, abductions of women are on the rise. As many as 98 cases of dowry related dowry deaths, 953 rape and 892 abduction cases were reported. Many more cases relating to such crimes go unnoticed as many victims hesitate to lodge complaints and a culture of silence often shrouds violence, which women suffer.
Domestic violence is violence that occurs with in the private sphere and it is nearly always a gender specific crime, perpetuated against women.
In the above mentioned circumstances we want to start a help line to provide services to women in distress and victims of violence.
Our objectivesMain objectives• Empowering women with information regarding legal, medical assistance etc.• To rebuild violated women’s self esteem, self worth and dignity• Offer immediate services in cases of family violence and atrocities in the forms of: Placement in institutions or referring to family service agencies/ hospitals/ police stations /family courts etc. Counseling Referral to other services including medical psychiatric, educational and vocational Legal AidBe a liaison between police and organization for women and childrenCreate awareness against Gender discrimination, women rights etc by framing and distribution brochures, pamphlets, handouts, posters etc.Document the work of the Helpline
Our MissionOur focus is on Gender equality and Rights of women advocating a life of dignity and justice for female world.
Our activitiesCase handling in the main activity of our Helpline. Counselors make efforts to sort out problems reported by the complainant. The Helpline comprises of coordinator and counselors understanding that every problem is different: hence each problem is handled catering to the need of the particular case and situation. Our counselors try to solve the cases and guide the survivors to police station/ hospitals/courts/ psychiatrists – as per the necessity enabling the women to fight for justice.
Collecting and Maintaining Information:In order to guide the women who approaches with their problems, the Helpline needs to be equipped with all relevant information. Women suffering from any form of violence, discrimation, harassment do nor know what to do and where to go . The Helpline provides information on infrastructures (both Governmental and non- Governmental) available to help them in seeking redressal. In formation regarding women police stations, women protection centers, family courts, legal assistance, NGOs involved in combating violence against women, NGOs providing medical Aid and health awareness, Shelter Homes, Legal Services Authority, National Commission for Women, State women Commission will be readily provided to survivors.
Networking and Linking with other organizations:Networking will help building services create awareness, campaign on the issue, follow up for effective enforcement of the existing laws, reforms in laws and create support for women survivors. Bhumika interacts with several women’s groups state wide in pursuing the cause of women. So the already existing network in carrying forward the mission of the Helpline.
Risk Management:The Helpline is a part of Bhumika Women’s Collective, which is a Registered Body. It has the backing of the women’s intelligentsia, who has been crusading for social justice for women since decades.
Management:The staff of the Helpline comprises one Coordinator, two Professional Counselors and One office assistant. The Head coordinator the entire functioning of the Helpline and the two professional counselors maintain the organization by providing advice, counseling and information. Helpline works in two shifts (8am –2pm and 2pm –8pm), enabling easy approach for the clients.The Helpline will be established in prime locality in the twin cities, where commuting will be or considerable case for the clients