6.11.06 తేదీన హైద్రాబాద్, బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ నుండి ఒక కాల్ వచ్చింది. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని అంటోంది. మీరు ఆ అమ్మాయితో మాట్లాడండి. ఆ కాల్ రాగానే మేము ఆ అమ్మాయి వివరాలు, ఫోన్ నెంబరు తెలుసుకుని వెంటనే ఆమెతో మాట్లాడాం. ఆమెది కూడా ఒక విచిత్రమైన సమస్య.
ఆ అమ్మాయి పేరు వాసవి (పేరు మార్చాం) వాసవి కుటుంబం చాలా ఉన్నతమైనది మరియు ఆర్థికంగా కూడా బాగా స్థితిపరులు. కాని సమస్య ఏమిటంటే వాసవిని ఇంట్లో ఎవరు పట్టించుకోకుండా గృహ నిర్భందంలో వుంచారు. ఆమె వయస్సు 30 సం. ఇంకా పెళ్ళి చేయలేదు. మొదట్లో ఆమె బెంగుళూరుకు చెందిన ఒక యువకుడిని పేమ్రించానని, అతనంటే అమ్మనాన్నలకు ఇష్టం లేదు. వారికి మీరైనా చెప్పి, పెళ్ళి జరిగేటట్లు చేయండి అని పాధ్రేయపడింది. అలా వాసవి దగ్గర నుండి సమస్యను తెలుసుకునే ప్రయత్నంలో భూమిక హెల్ప్ లైన్ ఆమెతో ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడింది, ధైర్యాన్ని చెప్పింది. దానితోపాటుగా ఆమెలో ఉన్న ఆత్మహత్య ప్రయత్నం అనే ఆలోచననుండి విరమింప చేసింది.
అసలు సమస్య ఏమిటంటే వాసవి ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు, మాటల సందర్భంలో ఆమె నాన్న, తనకి తొందరగా పెళ్ళి చేసి పంపేస్తే తన బాధ్యత తీరిపోతుందని అన్నాడట. అప్పటినుండి అమ్మనాన్నల మీద, వారికి వత్తాసు పలికే తన తమ్ముడి మీద ద్వేషం పెంచుకుంది. అంతేకాకుండా తనకి పెళ్ళి చేస్తే, పెళ్ళయిన వెంటనే విడాకులు తీసుకుంటుందని ఎవరో జోస్యం చెప్పగా తల్లిదండుల్రు ఆమెకు 30 సం పైన వున్నా ఇంతవరకు పెళ్ళి ప్రస్తావన తేవడం లేదు. దీనితో వాసవి డిప్రెషన్‍కు లోనయ్యింది.
కౌన్సిలర్ వాసవి సమస్యను హెల్ప్లైన్ కో-అర్డినేటర్‍కు వివరించడం జరిగింది. కో-అర్డినేటర్ వాసవి అమ్మగారితో మాట్లాడారు. అయినా వాసవి పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ లోగానే వాసవి ఇంట్లో వున్న వెండి వస్తువులతో ఇంటినుండి బయలు దేరి బెంగుళూరు వెళ్ళిపోయింది. . ఈమె అక్కడున్నపుడే వాసవి తల్లి అమ్మమ్మ, మేనమామ వాసవి మీద కేసు పెట్టి, ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకురావడానికి పయ్రత్నించారు. ఈ దశలో కో ఆర్డినేటర్ కల్పించుకుని, బెంగళూరు పోలీస్ స్టేషన్‍కు ఫోన్ చేసి వాసవి మీద కేసు అన్యాయమైందని, ఆమె మేజర్ కనుక తన ఇష్టం వచ్చినట్లుగా వుండే హక్కు ఆమెకు వుందని, ఆమెను వదిలి పెట్టమని కోరడం జరిగింది. ఆమె తల్లితో మాట్లాడి తల్లీ కూతుళ్ళ మధ్య రాజీ చేయడం జరిగింది. వాసవి పేరు మీద వున్న పెద్ద మొత్తం బ్యాంకు డిపాజిట్లు ఈ కేసులో కీలకపాత వహించాయి.
వాసవి కేసు ద్వారా భర్త నుండే కాకుండా తల్లిదండ్రుల నుండి ఆడపిల్లలు గురవుతారని అర్థమౌతుంది.
Wednesday, March 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment